Universal School | పాలకుర్తి: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల మైదానంలో జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన యూనివర్సల్ పాఠశాల విద్యార్థి అల్లాడి ధనూష్ రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు కరస్పాండెంట్ ఇస్మాయిల్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో ధనూష్ను ఆయన అభినందించారు.
ఈనెల 27,28 మరియు 29 తేదీలలో మెదక్ జిల్లా మనోహరాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు అల్లాడి ధనుష్ పాల్గొంటున్నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు కల్వల సంతోష్ తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మొహమ్మద్ ఇస్మాయిల్, ప్రధానోపాధ్యాయుడు సయ్యద్ అఫ్జల్ విద్యార్థిని అభినందించారు.