Vemulawada | కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి.. సీపీఎం
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని వేములవాడలో సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించి జిల్లా నాయకుడు ఎగమంటి ఎల్లారెడ్డి మాట్లాడారు.
- విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆపాలి
- వేములవాడలో సీపీఎం నాయకుల నిరసన
Vemulawada | వేములవాడ, జూలై 20 : విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని వేములవాడలో సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించి జిల్లా నాయకుడు ఎగమంటి ఎల్లారెడ్డి మాట్లాడారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ను పోలీసులు బలవంతంగా తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
నీట్ పరీక్ష పత్రాల లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యారంగం ప్రైవేటీకరణ, అధిక ఫీజులతో పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నాణ్యమైన, అందుబాటులో ఉండే విద్యను ప్రభుత్వం కల్పించాలని కోరారు. సోనం వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఖండిస్తూ, విద్యార్థుల సమస్యలను విస్మరిస్తే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ముక్తి కాంత్ అశోక్, రామంచ అశోక్, వాసం సురేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు కడారి శివ తోపాటు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- CPM
- Karimnagar
- Resign
- Siricilla
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

