Suicide | రాయికల్, మే, 28 : రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన సిరిపురం శ్రీహరి (47) అనే వ్యక్తి అప్పుల బాధ తాళ లేక బుధవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యలు పాల్పడినట్లు ఎస్సై సుధీర్ రావు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. అల్లీపూర్ గ్రామానికి చెందిన శ్రీహరి చేసిన అప్పులు అధికమవడంతో అప్పులు తీర్చ లేనేమోనని మనస్థాపానికి గురై జీవితంపై విరక్తి చెంది అతడి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు.
గమనించిన కుటుంబ సభ్యులు అతడిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య సిరిపురం అంజలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.