కాల్వశ్రీరాంపూర్ : కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య ( Suicide ) చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మృతురాలు తల్లి సరిత చెప్పిన వివరాల ప్రకారం మంతిని మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రేష్మ ( Reshma ) ను బూరుగుపల్లి గ్రామానికి చెందిన కోటేశ్వరకు మూడు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఒక కూతురు ఉంది.
రేష్మ కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతుందని, ఎన్ని మందులు వాడినా కడుపునొప్పి తగ్గకపోవడంతో ఈ నెల 16న బూరుగు పల్లెలోని తన ఇంటిలో పురుగుల మందు తాగిందని తెలిపారు.
గమనించిన కుటుంబ సభ్యులు పెద్ద పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులోని యశోద ఆసుపత్రికి తరలించారు. బుధవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని , మృతురాలి తల్లి సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు.