Road Accident | రోడ్డు ప్రమాదంలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుడి దుర్మరణం
పాలకుర్తి మండలం రామారావుపల్లి గ్రామానికి చెందిన దుర్గం మల్లయ్య (52) శనివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బసంత్ నగర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మల్లయ్య తెల్లవారుజామున ఫస్ట్ షిఫ్ట్ విధులకు ఇంటి నుంచి బయలుదేరాడు.
Road Accident | పాలకుర్తి : పాలకుర్తి మండలం రామారావుపల్లి గ్రామానికి చెందిన దుర్గం మల్లయ్య (52) శనివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బసంత్ నగర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మల్లయ్య తెల్లవారుజామున ఫస్ట్ షిఫ్ట్ విధులకు ఇంటి నుంచి బయలుదేరాడు. రామారావుపల్లి బస్టాండ్ వద్ద వేగంగావస్తున్న టిప్పర్ ఢీకొనడం వల్ల తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు.
జయ్యారం క్వారీల నుంచి కన్నాల క్రషర్ల యజమానులు టిప్పర్లతో ఓవర్‌లోడ్, అతివేగంగా బోల్డర్ (బండరాయి) తరలిస్తున్నారు. చిన్నరోడ్ పై నిత్యం టిప్పర్ లారీలు ఓవర్ లోడ్ తో అతివేగంగా నడవడం వల్ల ఈ మార్గం లో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు మండిపడుతున్నారు. విషయం తెలుసుకున్న బసంత్ నగర్ ఎస్ఐ నూతి శ్రీధర్ సంఘటనా స్థలానికి వెళ్లి సమాచారం తెలుసుకుని మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

