Suicide | కోనరావుపేట, ఆగస్టు 22 : అనారోగ్య సమస్యలతో వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. నిమ్మపల్లి గ్రామానికి చెందిన బోయిని మల్లేశం (54)అనే వ్యక్తి టైలరింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడి పలు దవాఖానలు తిరిగాడు.
అయినా అనారోగ్య సమస్యలు తగ్గక పొగ అవస్థలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో తీవ్ర మనోవేదన చెంది చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సమాచారం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మల్లేశం మృతి పట్ల వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతుదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్లకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.