వాళ్లిద్దరూ అన్నదమ్ములు. ఇద్దరూ ప్రాణస్నేహితుల్లా కలిసిండేవారు. ఎటు వెళ్లినా కలిసేపోయేవారు. పేద కుటుంబమైనా తల్లిదండ్రుల రెక్కల కష్టంతో చాలా కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించారు. కానీ, ఆ సంతోషం ఎంతోకాలం నిలువలేదు. రోడ్డు ప్రమాదం రూపంలో ఇద్దరినీ కబళించగా, ఆ తల్లిదండ్రులకు తీరని దుఃఖమే మిగిలింది. హన్మకొండ జిల్లా అనంతసాగర్ వద్ద జరిగిన ఘటన, హుజూరాబాద్ మండలం కందుగులలో విషాదాన్ని నింపింది.
హుజూరాబాద్ మండలం కందుగులకు చెందిన ఇప్పలపల్లి రమాదేవి-మనోహార్కు శివరామకృష్ణ(25), హరికృష్ణ(23) ఇద్దరు కొడుకులు. శివరామకృష్ణకు నెలక్రితం రైల్వే శాఖలో ఉద్యో గం రాగా, హైదరాబాద్లోని మౌలాలిలో టికె ట్ కలెక్టర్గా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. హరికృష్ణకు ఏడాది క్రితం సాఫ్ట్వేర్ జాబ్ రాగా, ఘట్ కేసరిలోని ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం చిన్న కొడుకు స్వగ్రామం కందుగులకు వచ్చా డు. పెద్ద కొడుకు సైతం ఆదివారం సెలవు కావడంతో ఇంటికి వచ్చాడు. ఇద్దరు కలిసి తల్లిదండ్రులతో సంతోషంగా గడిపి, మాటా ముచ్చట మాట్లాడుకొని తిరిగి సోమవారం వేకువజామున అన్నదమ్ములిద్దరూ కలిసి బైక్పై ఉద్యోగ రీత్యా హైదరాబాద్కు బయలు దేరారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం వరంగల్-కరీంనగర్ ప్రధాన రహదారిపై అనంతసాగర్ గ్రామ సమీపానికి చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొని శివరామకృష్ణ, హరికృష్ణ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. సంఘటన స్థ లానికి పోలీసులు చేరుకొని వారివద్ద ఉన్న వివరాల ప్రకారం తల్లిదడ్రులకు సమాచారం అం దజేశారు. తండ్రి మనోహర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
ఊరూరా బట్టలమ్మి చదివించి..
మనోహర్ది చాలా నిరుపేద కుటుంబం. భార్య రమాదేవి గ్రామంలో కూలి పనులకు వె ళ్తుండగా, మనోహర్ పద్మశాలి కులస్తుడు కావడంతో ఊరూరా బైక్పై తిరుగుతూ బట్టలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. తనలా కొడుకులు కష్టపడవద్దని చాలా కష్టపడి వారిని బాగా చదివించాడు. తల్లిదండ్రుల కష్టా న్ని గుర్తించిన కొడుకులు మంచి ఉద్యోగాలు సంపాందించారు. కానీ మృత్యువు కబలించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
మరణంలోని వీడని సోదర బంధం
చిన్నప్పటి నుంచే ఒకరు లేకుంటే మరొకరు ఉండే వారు కాదు. ఒక్క నిమిషం తమ్ముడు కనబడకుంటే అన్న.. అన్న కానరాకపోతే తమ్ముడు తల్లడిల్లేవారు. వారి ఇద్దరి ప్రేమ ఆప్యాయతలు చూసి గ్రామస్తులే ఆశ్చర్యపోయేవారు. అన్నదమ్ములిద్దరూ మృతిచెందారనే వార్త తెలిసి చాలా మంది కన్నీరుపెట్టారు.
పోస్టల్ శాఖలో జాబ్ వచ్చిందని చెప్పడానికి వచ్చి
హరికృష్ణ నాలుగు రోజుల క్రితం కందుగులకు వచ్చాడు. శివరామ కృష్ణ ట్రైనింగ్ ఉండడంతో హైదరాబాద్లోనే ఉండిపోయాడు. అయితే తనకు ఇటీవలే పోస్టల్ శాఖలో ఉద్యో గం వచ్చిందని, అమ్మానాన్నకు చెప్పేందుకు ఆదివారం ఇంటికి వస్తున్నానని, తిరిగి సోమవారం ఇద్దరం కలిసి హైదరాబాద్ బయలు దేరుదామని హరికృష్ణకు ఫోన్ చేసి చెప్పాడు. అనుకున్నట్లుగానే ఆదివారం కందుగుల గ్రా మానికి వచ్చి పోస్టల్ శాఖలో ఉద్యోగం వచ్చిందని చెప్పి ఇంట్లో మంచి చెడులు మాట్లాడుకొని ఇద్దరు కలిసి బైక్పై హైదరాబాద్కు బయ లు దేరారు. కొన్ని నిమిషాల్లోనే రోడ్డుప్రమాదంలో మృతిచెందారు.