గోదావరిఖని, జూలై 17: అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇద్దరు కార్మికులు చనిపోయారని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులైన అధికారులపై చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సింగరేణి రామగుండం-3 డివిజన్ పరిధిలోని ఓపెన్కా స్టు-2 (ఉపరితల గని)లో బుధవారం సాయం త్రం పైపులైన్ లీకేజీ పనులు చేస్తున్న క్రమంలో సైడ్వాల్ కూలి ఫిట్టర్ వెంకటేశ్వర్లు (58), జనరల్ మజ్దూర్ కార్మికుడు విద్యాసాగర్ (34) మృ తి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రాత్రి గోదావరిఖని సింగరేణి ఏరియా దవాఖానలో కార్మికుల మృతదేహాలను పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ధై ర్యం చెప్పారు.
అనంతరం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. గడిచిన నాలుగు రోజులు గా వర్షాలు కురుస్తున్నాయని, సరైన రక్షణ చర్య లు తీసుకోవడం లేదని వెంకటేశ్వర్లు మంగళవా రం యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా అధికారు లు పట్టించుకోలేదని ఆరోపించారు. ఆ కారణంగానే పైపులైన్ లీకేజీ పనులు చేస్తున్న కార్మికులపై మట్టి కూలి మృతి చెందాదని ఆవేదన చెందారు. అదృష్టవశాత్తు మరో ఇద్దరు కార్మికులు ప్రాణపాయం నుంచి బయటపడ్డారని చెప్పారు.
కార్మికులు తప్పుచేస్తే ఎల్లో, రెడ్కార్డులు జారీచేసి చర్య లు తీసుకుంటామని చెబుతున్న యాజమాన్యం, తప్పు చేసిన అధికారులపై ఏలాంటి చర్యలు తీసుకుంటుందో? తెలుపాలని డిమాండ్ చేశారు. అనంతరం ఐఎఫ్టీయూ నేత తోకల రమేశ్ మా ట్లాడుతూ, రక్షణ చర్యల్లో లోపం కారణంగానే ఇద్దరు కార్మికులు చనిపోయారని ఆరోపించారు.
కార్మికుల మృతికి అధికారులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు యాజమాన్యం బీమా డబ్బులు చెల్లించి చేతులు దులుపుకోకుండా 3 కోట్లు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశా రు. కార్మికుల మృతిపై ఐఎఫ్టీయూ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.