Dharmaram | కోనరావుపేట, మార్చి 29 : ఊర చెరువులో దిగిన ఇద్దరు గొర్రెల కాపరులు మృతి చెందిన ఘటన ధర్మారం గ్రామంలో విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం ప్రకారం.. కొనరావుపేట మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన ముడికే లక్ష్మీరాజం (55), కుమ్మం మొండయ్య (49) అనే ఇద్దరు గొర్రెల కాపరులు ఆదివారం చెరువులోకి దిగి గొర్రెలకు సాన్నం చేయిస్తుండగా ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందారు.
స్థానికుల సమాచారం మేరకు కాపలాదారులు రోజు వారిగా తమ గొర్రెలను మేపుతూ చెరువు వద్దకు వచ్చారు. ఇదే క్రమంలో గొర్రెలకు సాన్నం చేయిద్దామని వారు నీటిలోకి దిగారు. అయితే లోతైన నీటిలో చిక్కుకుని బయటకు రాలేక మునిగిపోయారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని గజ ఈత గాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.