Bhattupally | మంథని రూరల్, డిసెంబర్25: ఎలాంటి సూచికలు లేకుండా ప్రధాన రహాదారి పై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం భట్టుపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది.
మంథని ఎస్ఐ2 సాగర్ కథనం ప్రకారం..8వ కాలనీకి చెందిన పిడుగు రాజ్ కుమార్(33), రాంశెట్టి కిష్టయ్య(39) అనే ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై మేడారంకు పని నిమిత్తం వెల్లి బుధవారం రాత్రి తిరిగి వస్తున్న సమయంలో భట్టుపల్లి శివారులోని మైసమ్మ గుడి వద్ద ఎలాంటి హెచ్చరికలు లేకుండా నడి రోడ్డుపై ట్రాక్టర్, ట్రాలీ నిలిపి ఉంచడంతో దానిని గమనించకుండా స్కూటి పై వచ్చిన రాజ్‌కుమార్, కిష్టయ్య ప్రమాదవశాత్తు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.
మృతుడు రాజ్ కుమార్ తండ్రి పిడుగు బక్కయ్య ఇద్దరు వ్యక్తుల మృతి పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ట్రాక్టర్‌ను రోడ్డు పై నిలిపిన ట్రాక్టర్ డ్రైవర్‌ను సతీష్‌గా తెలిసిందని మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాగర్ తెలిపారు.