కోనరావుపేట, ఏప్రిల్ 27 : దాహం కోసం చెరువులోకి దిగిన రెండు మూగ జీవాలు రైతు కళ్లెదుటే మునిగి మృత్యువాత పడ్డాయి. కోనరావుపేట మండలం సుద్దాలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. సుద్దాలకు చెందిన సుంకరి పర్శరాములు తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. తన తండ్రి గతంలోనే చనిపోగా తల్లి దేవవ్వ, కుటుంబసభ్యులు ఉన్నా రు. పర్శరాములు రెండు కాడెడ్లతోపాటు ఆవును సాదుకుంటూ ఉపాధి పొందుతున్నాడు. ఈక్రమంలో రోజు మాదిరిగానే తన బాబాయి సుంకరి భూమయ్యకు చెందిన కొట్టంలో ఉన్న బండికి అక్కడే ఉన్న రెండెడ్లను, వెనుకాల ఆవు, మరో కోల్లాగెను కట్టుకుని వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరాడు.
దీంతో ఆ మూగజీవాల దాహం కోస అరవగా, దారిపక్కనే ఉన్న ఊరచెరువులోకి బండి ని దించాడు. బండికి వెనుక ఉన్న ఆవు, కోడె బెదరడంతో ఎడ్లు చెరువులోకి లాక్కెల్లాయి. అయితే, ఆ చెరువు లోతుగా ఉండడంతో బండితో సహా ఎడ్లు, ఆవు, కోడె నీటిలో మునిగాయి. రైతు భూ మయ్య సైతం నీటిలో మునిగినా ఎలాగోలా బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నాడు. మూగ జీవాలనుకాపాడుకోడానికి రైతు ప్రయ త్నం చేసినా ఫలించలేదు. కండ్లెదుటే ఆవు, కోడె విలవిలా కొట్టుకుంటున్న తీరునుచూస్తూ ఏమీచేయలేక రోదిస్తూ ఉండిపోయాడు.
కొంత దూరం లో ఉన్న పుట్ట నర్సయ్య వచ్చి చెరువులో దూకి ఎడ్లబండికి ఉన్న రెండెడ్లను తప్పించి వాటిని కా పాడాడు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకు న్న కుటుంబసభ్యులు ‘అయ్యో బిడ్డలాలా.. గిటె టు చెరువులోకి వస్తిరే’ అంటూ రోదించిన తీరు గ్రామస్తులను సైతం కంటతడి పెట్టించింది. సు మారు రూ.1 లక్ష విలువ గల ఆవు, కోడెను నష్టపోయినట్లు బాధిత రైతు వాపోయాడు. ప్రభు త్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పం చ్ ఉప్పుల దేవలక్ష్మి, ఎంపీటీసీ కాశవేణి మమత, సింగిల్ విండో వైస్‌చైర్మన్ కాశవేణి మహేశ్‌యాదవ్, ఉపసర్పంచ్ ఎర్రవెల్లి నాగరాజు కోరారు.