Autos Seized | సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 8: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ ( టెక్స్ టైల్ పార్క్) లో సోమవారం ఎలాంటి అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి గడ్డం చందన కు చెందిన రెండు ఆటోలను ఎన్నికల అధికారులు సీజ్ చేశారు.
ఇందిరమ్మ కాలనీ పరిధిలోని కేసీఆర్ నగర్ లో నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తున్నారనే ఫిర్యాదు తో ఎన్నికలు అధికారులు పట్టుకొని, ప్రచారాన్ని నిలిపివేశారు. సర్పంచ్ అభ్యర్థి కి కేవలం ఒకే వాహనానికి అనుమతి ఇస్తున్నారు. ఈ క్రమం లో ఇందిరమ్మ కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థి చందన రెండు ఆటోలను అనుమతి లేకుండా, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేయడం తో ఆటోలను సీజ్ చేసినట్లు తహసీల్దార్ జయంత్ కుమార్ తెలిపారు.