KORUTLA | కోరుట్ల, ఏప్రిల్ 10: విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచేందుకు ట్విన్నింగ్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని మండల విద్యాధికారి గంగుల నరేషం అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలను ట్వినింగ్ ఆప్ స్కూల్స్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని కల్లూరు, ధర్మారం, తిమ్మాయిపల్లి, గుమలాపూర్ యూపీఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థులు గురువారం సందర్శించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న ప్రాక్టికల్ లాబ్స్, ఇన్ఫ్రా స్ట్రక్చర్, లైబ్రరీ, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులు ఇతర పాఠశాలను సందర్శించడం ద్వారా విద్యార్థులకు బోధన ప్రక్రియ, నాణ్యత సమస్యలు, స్పెషల్ ఇన్నోవేటివ్ ప్రాజెక్టులు, సైన్స్ ఫెయిర్ వంటివి పరిశీలించే అవకాశం కలుగుతుందన్నారు.
విద్యార్థుల మధ్య పరస్పర అవగాహన, సోదర భావం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఆనందరావు, సుమలత యూపీఎస్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నరహరి, పర్జన బేగం, అంజయ్య ఉదయ రూప, వాజిద్, అజీమ్, సీఆర్పీలు గంగాధర్, దేవేందర్, జ్యోతి, మన్విత, తదితరులు పాల్గొన్నారు.