ముకరంపుర, నవంబర్ 23: విద్యుత్ ప్రైవేటీకరణ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్, ఇంజినీర్స్(ఎన్సీసీవోఈఈఈ) ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో చేపట్టిన నిరసన కార్యక్రమం లో తెలంగాణా రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం(టీఆర్వీకేఎస్) నాయకులు పాల్గొన్నారు. సం ఘం రాష్ట్ర కార్యదర్శి కోడూరి ప్రకాశ్ ఆధ్వర్యంలో సుమారు 200మంది నాయకులు జం తర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నాలో పాల్గొన్నా రు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినదించారు. విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.