జగిత్యాల టౌన్, మే 12: నిబంధనలకు విరుద్ధంగా, అనుమతి లేని రసాయనాలను వాడుతున్నట్టు ఫిర్యాదులు రావడంతో చల్గల్ మ్యాంగో మార్కెట్‌ను సోమవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. మార్కెట్ నుంచి ఇతర రాష్ర్టాలకు వెళ్తున్న అన్ని ట్రక్‌లను పరిశీలించారు. ప్రభుత్వ అనుమతి లేని ఎఫ్ఐకే ఇథలిన్ రైపనర్‌ను వాడి మామిడికాయలను ప్యాక్ చేసిన ఓ ట్రక్‌ను సీజ్ చేయడంతోపాటు సంబంధిత కమిషన్ ఏజెంట్‌పై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష మాట్లాడుతూ, మార్కెట్లోని కమీషన్ ఏజెంట్లకు ఇంతకు ముందు కూడా సలహాలు, సూచనలు జారీ చేశామని తెలిపారు. అయినా అనుమతి లేని రసాయనాలను వాడుతున్నారన్నారు.
సోమవారం 600 ట్రేలలో అనుమతి లేని రసాయనాలతో ప్యాకింగ్ చేసి, ఇరత రాష్ర్టాలకు వెళ్తుండగా ట్రక్‌ను పట్టుకొని, సంబంధిత కమీషన్ ఏజెంట్‌పై కేసు నమోదు చేశామని చెప్పారు. ఇథలిన్ రైపనర్లను వాడొద్దని పదేపదే చెప్పినప్పటికీ.. మార్కెట్లో ఉన్న ప్రతి కమీషన్ ఏజెంట్ డైరెక్ట్‌గా వాటిని ఉపయోగిస్తున్నారన్నారు. నిబంధనలు ఉల్లంఘించి అనుమతిలేని ఎఫ్ఐకే ప్రొడక్ట్‌లను వాడుతున్న ఏజెంట్ల వద్ద మామిడికాయలను తనిఖీ చేసి, సీజ్ చేశామన్నారు. శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు.