కరీంనగర్ కార్పొరేషన్, మే 26 : జేఈఈ మెయిన్స్-2025 ఫలితాల్లో బీ ఆర్చ్, బీ ప్లానింగ్‌లో కరీంనగర్‌లోని ట్రినిటీ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. బీ ప్లానింగ్ విభాగంలో బీ హితేశ్ 152వ ర్యాంకు, డీ మహేశ్ 227, బీ రేణుక 393, ఏ శరణ్యనందిని 737, ఎం నిఖిత్నాయక్ 1031, వీ లత 1092, జీ అజయ్ 1115, ఆర్ ఐశ్వర్య 1272, ఎం అంజనశ్రీ 1388 ర్యాంకు సాధించారు. బీ-ఆర్చ్‌లో బీ హితేశ్ 718, డీ మహేశ్ 756, బీ రేణుక 1208, ఆర్ ఐశ్వర్య 1877, ఏ శరణ్యనందిని 1855 సాధించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో కళాశాల వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ నిర్ధేశించుకున్న లక్ష్యాలు చేరుకునేందుకు నిర్ధిష్టమైన ప్రణాళిక, నిరంతర శ్రమ అవసరమని తెలిపారు. వాటితోపాటు క్రమశిక్షణతో విద్యను అందించడం ద్వారా ఈ విజయాలు సాధించినట్లు తెలిపారు.
ఈ విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి, ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఈ విద్యార్థులు సాధించిన ర్యాంకులు ట్రినిటి విద్యా సంస్థల్లో ఉన్నతమైన విద్యా బోధనకు ప్రతీకగా నిలుస్తాయన్నారు. భవిష్యత్తులో వారు ఎంచుకున్న రంగాల్లో రాణించి తమ తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.