LMD Colony | తిమ్మాపూర్, మార్చి 2 : తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మాజీ నాయకుడు బొమ్మిడి భద్రయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా ఆయన స్వగృహంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పెండ్యాల కేశవరెడ్డి, మండల అధ్యక్షుడు వంగపల్లి నారాయణ, మండల గౌరవ అధ్యక్షుడు శాంతికుమార్, ప్రధాన కార్యదర్శి శిలుముల వెంకటేశ్వర్లు, అసోసియేషన్ ప్రెసిడెంట్ మామిడాల సిద్దయ్య తదితర నాయకులు సోమవారం భద్రయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు డీ నారాయణ రెడ్డి, కే ప్రకాష్, బండి కుమార్, బండి మొగిలి, ఎన్ కొండయ్య, బుర్ర మల్లయ్య, కే పోషయ్య, వై రాజయ్య, పీ మల్లయ్య, చెంచు రామయ్య, డీ గంగారాం, ఎన్ మల్లయ్య, ఆర్ నారాయణతో పాటు రిటైర్డ్ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.