తమిళ అగ్ర కథానాయకుడు ధనుష్ ప్రధాన పాత్రలో ‘అమరన్’ఫేం రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓం’. సాయిపల్లవి, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆర్ టేక్ స్టూడియోస్, వండర్‌బార్ ఫిల్మ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి మాట్లాడుతూ “ఓం’ అనేది ఆధ్యాత్మిక శీర్షిక కాదు. అనేక అర్థాలను ఇమిడ్చుకున్న ఒక ప్రత్యేకమైన టైటిల్ ఇది. ఈ కథలో ఆసక్తికరమైన అంశాలు, వివిధ కోణాలు దాగివున్నాయి.
ఈ సినిమాకు అంతా అంకితభావంతో పనిచేస్తున్నారు. ఎందరో ప్రతిభామూర్తుల సమాహారం ఈ సినిమా. అందరి కృషి ఫలితంగా సినిమా అద్భుతంగా తెరకెక్కుతున్నది. తొలి షెడ్యూల్ పూర్తయింది’ అని చెప్పారు. ఇంకా వండర్‌బార్ ఫిల్మ్స్ ప్రతినిధి శ్రేయస్, ఆర్ టేక్ స్టూడియోస్ ప్రతినిధులు శ్రద్ధ, అజ్మత్, డివో మ్యూజిక్ ప్రతినిధి విషు, వార్నర్ మ్యూజిక్ గ్రూప్ ఇండియా ప్రతినిధి జై మెహతా కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: ఎళిలరసు, సంగీతం: సాయి అభ్యంకర్, ఎడిటింగ్: కలైవసన్.