MANTHANI | మంథని, ఏప్రిల్ 17: రామగుండం తహసీల్దార్ గా పనిచేస్తూ ఇటీవల బదిలీ పై వచ్చి మంథని తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన కుమారస్వామిని మీ సేవ నిర్వాహకుల సంఘం జిల్లా అధ్యక్షుడు అట్టెం రాజు ఆధ్వర్యంలో నిర్వాహకులు గురువారం సన్మానించారు.
స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంథని పట్టణ మీసేవ ఆపరేటర్లు ప్రయాకర్రావు, చంద్ర శేఖర్(శ్యామ్), పుప్పాల సతీష్, బండారి రమేష్, పార్షవేన సతీష్, మేడి వెంకటేశ్వర్లు, మేడి జగన్, కాయితోజు సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.