Health Minister Damodar Rajanarasimha | పెద్దపల్లి, సెప్టెంబర్25: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాను కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర పార్మసీ కౌన్సిల్ సభ్యుడు మాడూరి వినోద్ కుమార్ సన్మానం చేశారు. ప్రపంచ ఫార్మసిస్ట్ డే సందర్భంగా గురువారం హైదరాబాద్లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఫార్మసిస్టులకు సంబంధించిన సమస్యలను మంత్రికి వివరించినట్లు వినోద్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ సభ్యులు తోడుపునూరి రాజు, నాగ సాయి శ్రీకేష్ తదితరులు పాల్గొన్నారు.