Godavarikhani | కోల్ సిటీ, జూన్ 23: భజరంగ్ దళ్ అఖిల భారతీయ పిలుపు మేరకు సోమవారం గోదావరిఖని నగరంలోని శ్రీ కోదండ రామాలయం ఆవరణలో వృక్షారోహణం చేపట్టారు. భజరంగ్ దళ్ కార్యకర్తలు సేవా సప్తాహం పేరుతో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా భజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ ముష్కి సంపత్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా సేవా సప్తాహంతో చేపడుతున్న వృక్షారోహణంలో భాగంగా మొక్కలు నాటినట్లు తెలిపారు.
ప్రకృతిని కాపాడుకునే బాధ్యత తీసుకొని కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటడం పట్ల అభినందించారు. మొక్కలను ప్రకృతి దేవతలుగా ఆరాధిస్తూ వృక్షాలుగా ఎదిగేంత వరకు సంరక్షించే బాధ్యత తీసుకుంటామన్నారు. పర్యావరణం పరిరక్షణలో భజరంగ్ దళ్ కార్యకర్తలు ముందుండాలని సూచించారు. కార్యక్రమంలో అడిగొప్పుల రాజు, మునగాల సంపత్, బండ రాజేశం, మేడగోని అరవింద్, మద్దెల శ్రీనివాస్, వినయకుమార్, శివ, కిరణ్, నరేష్, లక్ష్మణ్ సాయి తదితరులు పాల్గొన్నారు.