Mid-Level Health Providers | పెద్దపల్లి, అక్టోబర్ 6 : మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ప్రోగ్రాం, యాప్ నిర్వహణ శిక్షణ, ఎసీడీ( అంసక్రామిత వ్యాధులు)పై అవగాహన కార్యక్రమాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. ఎన్సీడీ స్క్రీనింగ్, కేసుల వివరాల నమోదు, పరీక్షల వివరాలు, చికిత్స, రెఫరల్ వివరాలు, ఫాలో అప్ చేసిన వివరాలను యాప్లో నమోదుపై డీఎంహెచ్వో డాక్టర్ వాణి శ్రీ అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారులు ఆర్ రాజమౌళి, బీ శ్రీరాములు, కేవీ సుధాకర్ రెడ్డి, బీ కిరణ్ కుమార్, ఎన్సీడీ జిల్లా కో -ఆర్డినేటర్లు మధుసూదన్, టీ రాజేశం, జిల్లా డేటా మేనేజర్ మహేందర్, ఎంఎల్హెచ్పీలు పాల్గొన్నారు.