జగిత్యాల కలెక్టరేట్, మే 8: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ అశోక్‌కుమార్ సూచించారు. బైక్‌లకు కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్లను మార్చి అధిక శబ్ధం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిని ఇటీవల జిల్లా పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి పట్టుకున్నారు. 130 ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను తొలగించి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్రవాహనాల సైలెన్సర్లను మార్చడం చట్టరీత్యా నేరమన్నారు.
శబ్ధ కాలుష్యాన్ని నియంత్రణలో ఉంచడంతో పాటు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అధిక శబ్ధం చేసే ద్విచక్రవాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లను వినియోగించే వాహనాలను సీజ్ చేస్తామని, డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫార్సు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘుచందర్, జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.