రాజన్న సిరిసిల్ల, మే 20 (నమస్తే తెలంగాణ): నేతన్నల ఉపాధి కోసం గత ప్రభు త్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగించాలని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలంగాణ వపర్లూం వర్కర్స్ యూనియన్ టీపీవీయూ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ పేర్కొన్నారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో టీపీవీయూ నాయకులు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సిరిసిల్ల చేనేత జౌళీశాఖ ఏడీ సాగర్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ, టెక్స్టైల్స్ పార్కుతో పాటుగా సిరిసిల్ల పవర్‌లూం కార్మికులకు రావాల్సిన పది శాతం యారన్ సబ్సిడీ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చేనేత జౌళీశాఖ డైరెక్టర్ ఏకపక్ష నిర్ణయాలను ఎట్టి పరిస్థితిలో సహించేదిలేదన్నా రు. నేత కార్మికుల ఉపాధి దెబ్బతీసే విధంగా ఆమె వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. మరమగ్గాల పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టివేసే విధంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవ డం సరికాదన్నారు.
కార్మికులకు పది శాతం యారన్ సబ్సిడీ తగ్గించకుండా ఇవ్వాలని మాండ్ చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యలపై వెం టనే సమీక్షా సమావేశం నిర్వహించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేస్తే ఈ నెల 24న హైదరాబాద్‌లోని చేనేత జౌళీశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమం లో జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, నాయకులు నక్క దేవదా స్, గుండు రమేశ్, కంది మల్లేశం, బెజు గం సురేశ్, తదితరులు పాల్గొన్నారు.