Moodapalli | చందుర్తి,మే23 : తాటి చెట్టు పై నుంచి కిందపడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికు కథనం ప్రకారం.. చందుర్తి మండలం మూడపెల్లి గ్రామానికి చెందిన వట్టిమల్ల రవి గురువారం సాయంత్రం తన వృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కుతున్న సమయంలో కాలు జారి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే స్థానికుల సహాయంతో వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదానికి గురైన రవికి వెన్నుపూస,నడుం భాగాల్లో తీవ్ర గాయలవడంతో పాటు పక్కటెముక విరిగిపోయింది. రవి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని గీత కార్మిక సంఘం నేతలు ప్రభుత్వాన్ని కోరారు.