తిమ్మాపూర్ రూరల్, మార్చి 5: తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ గ్రామంలోని రాంలీలా మైదానంలో సోమవారం ముందస్తుగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ తెలిపారు. ఉదయం 10 గంటలకు తెలంగాణ అమరవీరుల స్తూపం నుంచి భారీ ర్యాలీతో అతిథులు సభకు చేరుకుంటారని చెప్పారు.
వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలకు స్త్రీశక్తి పురసారాలను అందజేసి, ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ టీవీ సీరియల్ నటీమణులు, యూట్యూబ్ స్టార్స్‌తో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ హాజరుకానున్నారని తెలిపారు. మహిళా సమైక్యతను చాటే వేడుకలకు మానకొండూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు చెందిన మహిళలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.