Nationwide strike | రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, జూలై 2: జూలై 9న జరిగే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని సీఐటీయూ బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు బీడీ కంపెనీలలో బుధవారం సమ్మె నోటీసు అందించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని , కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ ల రద్దు తదితర ఇతర డిమాండ్లతో ఈ సమ్మె చేపడుతున్నట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు.
కావున దేశం, రాష్ట్రంలోని అన్ని కార్మిక సంఘాల జాయింట్ ప్లాట్ ఫామ్ ఆధ్వర్యంలో జూలై 9న చేపట్టబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బీడీ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులు అందరూ పాల్గొనాలని తెలుపుతూ బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు సూరం పద్మ , శ్రీరాముల రమేష్ చంద్ర ఆధ్వర్యంలో సిరిసిల్ల, తంగళ్ళపల్లి, చంద్రంపేటలోని బీడీ సెంటర్లలో మేనేజర్లకు సమ్మె నోటీసులను అందజేశారు.