Accident | రుద్రంగి, జూన్ 11: రుద్రంగి మండలం మానాల ఘాట్ రోడ్డులో సీమర్ల వద్ద కంకర తరలిస్తున్న టిప్పర్ బుధవారం ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మానాల వైపు నుండి రుద్రంగికి కంకర లోడ్‌తో టిప్పర్ వస్తున్న క్రమంలో మానాల ఘాట్ రోడ్డులో సీమర్ల వద్ద అదుపుతప్పి టిప్పర్ బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్ బుజ్జికు తీవ్ర గాయాలయ్యాయి. కాగా స్థానికులు గమనించి నిజామాబాద్ జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.