Peddapalli | పెద్దపల్లి, మార్చి15 : రోడ్డుపై చెత్త వేస్తే జరిమాన తప్పదని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్ హెచ్చారించారు. పట్టణంలోని ప్రగతినగర్‌లోని స్టీల్ రైలింగ్, ఫ్లైవుడ్, హార్డ్‌వేర్ దుకాణ యజమానులు రోడ్డు పైన చెత్త వేసినందు రూ. 2000 చొప్పున మొత్తం రూ. 6000 జరిమానా వేసినట్లు తెలిపారు. దుకాణ యజమానులు చెత్తను రోడ్లపైన పడేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందచేయాలని, రోడ్లపైన చెత్త వేస్తే జరిమాన విధించబడుతుందని స్పష్టం చేశారు. స్వచ్ఛ పెద్దపల్లిలో ప్రజలందరు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ అనిల్, వార్డు ఆఫీసర్లు లక్ష్మీ, నర్సయ్య, వసీం పాల్గొన్నారు.