Valbhapur | వీణవంక, జనవరి 16 : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మండలంలోని వల్భాపూర్ గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ ముగ్గుల పోటీల్లో మొత్తం 46 మంది పాల్గొనగా సంక్రాంతి పండుగ ప్రతిభింబించేలా అందంగా ముగ్గులు వేసిన మారముళ్ల మహాలక్ష్మి మొదటి బహుమతి, నలుబాల తేజస్వీ రెండో బహుమతి, మారముళ్ల రాజేశ్వరీ మూడో బహుమతి పొందారని, ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మిగతా 43 మంది కన్సోలేషన్ బహుమతులు అందజేశామని నిర్వాహకులు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీల నిర్వాహకులు జీడి వెంకటస్వామి, నలుబాల రాజేశ్, జీడి దేవేందర్, వడ్డేపెల్లి రాజగోపాల్, మారముళ్ల అనిల్‌కుమార్, రమేష్, ప్రభు, శేఖర్, బుర్ర రాజేశ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.