GodavariKhan | కోల్ సిటీ, మార్చి 22 : హనుమాన్ జయంతి సందర్భంగా ఈనెల 31న గోదావరిఖనిలో పెద్ద ఎత్తున తలపెట్టిన వీర హనుమాన్ విజయ యాత్ర కు ఇంటికొకరు వేలాదిగా తరలి రావాలని వీహెచ్పీ కార్యదర్శి అయోధ్య రవీందర్ తెలిపారు. గోదావరిఖని శ్రీ కోదండ రామాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ గట్ల రమేష్, ఆలయ ఈవో ఎం.శంకరయ్యతో కలిసి ఆదివారం వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 31న సాయంత్రం 6 గంటలకు నగరంలో జరిగే వీర హనుమాన్ శోభాయాత్రకు హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. శ్రీ కోదండ రామాలయం నుంచి మారుతీ నగర్ హనుమాన్ దేవాలయం వరకు ర్యాలీ సాగుతుందనీ, పార్టీలకు అతీతంగా హిందూ సంఘటన శక్తిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
హిందూ ధర్మం పరిరక్షణ కోసం యువత బాధ్యతగా ఈ ర్యాలీలో పాల్గొని హిందూ సంఘటిత శక్తిని చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీ నగర కార్యదర్శి మునిగాల సంపత్, కౌటం సతీశ్, దాసరి విజయ్, అర్చకులు శశిధర చార్యులు, ఆడిగొప్పుల రాజు, భజరంగ్ దళ్ కన్వీనర్ సంపత్ యాదవ్, కన్వీనర్ దిగంబర్, మ్యాడగోని అరవింద్, ఆరెల్లి జలంధర్, సురేష్ భవాని, శ్రావణ్, లింగన్న, సురేశ్, ఆలయ సీనియర్ అసిస్టెంట్ సుధాకర్ తోపాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.