UREA | మానకొండూర్ రూరల్, ఆగస్టు 11: రైతన్నలకు తెల్లారిందంటే యూరియా కోసం బారులు తీరి గంటల తరబడి నిల్చుంటే రెండు బస్తాలు ఇస్తున్నారు. మానకొండూరు మండలం వెల్ది, వేగురుపల్లి గ్రామాలకు గాను ఊటూరు సోసైటీ ద్వారా ఒక్కనొక్క లోడ్ లారీల్లో 460 బస్తాలు వచ్చాయి. ఒక్కొక్క గ్రామానికి 230 బస్తాల చొప్పున పంపిణీ చేశారు. వెల్లి, వేగురుపల్లి గ్రామాల రైతులకు పొద్దంతా నిల్చుంటే రెండేసి బస్తాల చొప్పు పంపిణీ చేశారు.
50 శాతం మందికి మాత్రమే అందినట్లు రైతులు తెలిపారు. సోసైటీ సీఈఓ ఎడ్ల స్వామి రెడ్డి వివరణ కోరగా బస్తాలు తక్కువగా ఉన్న మాట వాస్తవమేనని, రెండు, మూడు రోజుల్లో అందరికీ అందేలా వంతు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.