శంకరపట్నం, జూలై 13 : తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపిన కేసీఆర్ పాలన మళ్లీ రావాలని రాష్ట్ర రైతాంగం ఎదురుచూస్తున్నదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. సోమవారం శంకరపట్నంలో ఉప సర్పంచుల ఫోరం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, కేశవపట్నం ఉపసర్పంచ్ ఆకుబత్తిని విజయ్‌కుమార్‌తోపాటు పలువురు బీఆర్ఎస్లో చేరగా, ఆయన వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం రసమయి మాట్లాడారు.
కేసీఆర్ పాలనలో నిరందీగా ఎవుసం చేసుకున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అద్భుతంగా పంటలు పండించుకున్నారని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ పాలనలో అంతా ఆగమైందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోయిందని, ఎటు చూసినా ప్రజల ఆవేదన, కన్నీళ్లే కనిపిస్తున్నాయని ఆవేదన చెందారు. అధికారంలోకి వచ్చిన 30 నెలల్లో స్థానిక ఎమ్మెల్యే కనీసం 30 గ్రామాల్లో కూడా పర్యటించి ప్రజల సాధకబాధకాలు తెలుసుకోలేదని విమర్శించారు. పొలాల్లో రక్తం చల్లితేనే పంటలు పండుతాయని సీఎం దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపిష్టి కాంగ్రెస్ కాలం ఎప్పుడు పోతుందా..? అని ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు.
కాగా, బీఆర్ఎస్లో చేరిన వారిలో వార్డు సభ్యురాలు గొడిశాల రజిత-రాములు, బీజేపీ నుంచి ఇప్పలపల్లికి చెందిన వెంగళ రాజు, కొత్తగట్టుకు చెందిన నల్ల జైపాల్‌రెడ్డి, కేశవపట్నం నుంచి సామల హరీశ్, ఆకుబత్తిని సత్యనారాయణ, గాజుల శ్రీనివాస్, కొంపెల్లి రాజు, తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు గంట మహిపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీలు పొద్దుటూరి సంజీవరెడ్డి, లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండల చైర్మన్ కొయ్యడ పర్శరాములు, సర్పంచులు తాళ్లపల్లి మొగిలి గౌడ్, నూనె శ్రీనివాస్, పూదరి రాజు, ఉపసర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు సుభాష్‌రెడ్డి, ఉపసర్పంచులు వెంగళ ప్రవీణ్, రాజేందర్, బాగోతపు కుమార్, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు గుర్రాల తిరుపతిరెడ్డి, గోపు విజయ్‌కుమార్‌రెడ్డి, కాటం వెంకటరమణారెడ్డి, మోత్కూరి సమ్మయ్య, మోరె శ్రీనివాస్, మొకిరాల కిషన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.