ప్రస్తుతం అగ్ర కథానాయకుడు అక్కినేని నాగచైతన్య ‘వృషకర్మ’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నది. ఈ సినిమా తర్వాత చేయాల్సిన ప్రాజెక్ట్‌ని కూడా నాగచైతన్య ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. ‘బెదురులంక 2012’ చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న క్లాక్స్ దర్శకత్వంలో ఆయన తర్వాత సినిమా ఉంటుంది.
ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి తీసుకెళ్లే యోచనలో చైతూ ఉన్నారు. ఇదిలావుంటే.. ఈ క్రమంలోనే ‘మసూద’ దర్శకుడు సాయికిరణ్ కూడా ఇటీవలే చైతూకి కథ వినిపించారట. తన తొలి సినిమా ‘మసూద’తో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సాయికిరణ్, గత రెండేళ్లుగా ఓ హారర్ థ్రిల్లర్ స్క్రిప్ట్‌పై వర్క్ చేశారు. ఏషియన్ సునీల్ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ కోసమే చైతూని సాయికిరణ్ కలిసినట్టు, కథ వినిపించినట్టు తెలిసింది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్పైకెళ్లే అవకాశం ఉన్నది.