సర్పంచులకు బిల్లులు వస్తలేవు
పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి గుర్తు చేశారు. కానీ, మూడేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైందని, పల్లెల్లో అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు బిల్లులు రాని దుస్థితి ఉన్నదని విమర్శించారు. రాయికల్ మండలం రామాజిపేటకు చెందిన ఎనుగంటి రాములు తన తల్లితండ్రుల జ్ఞాపకార్థం సమకూర్చిన బాడీ ఫ్రీజర్‌ను సోమవారం ఆయన గ్రామ పంచాయతీకి అందజేశారు.
- పంచాయతీల్లో నిధుల కొరత ఉన్నది
- కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి
- మూడేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
- బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి
జగిత్యాల కలెక్టరేట్, జూన్ 1 : పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి గుర్తు చేశారు. కానీ, మూడేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైందని, పల్లెల్లో అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు బిల్లులు రాని దుస్థితి ఉన్నదని విమర్శించారు. రాయికల్ మండలం రామాజిపేటకు చెందిన ఎనుగంటి రాములు తన తల్లితండ్రుల జ్ఞాపకార్థం సమకూర్చిన బాడీ ఫ్రీజర్‌ను సోమవారం ఆయన గ్రామ పంచాయతీకి అందజేశారు.
ఈ సందర్భంగా ఎనుగంటి రాములును అభినందించారు. అనంతరం జీవన్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పదవులను త్యాగం చేసిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. ఆయన పదేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశారని, గ్రామాలను అభివృద్ధి బాట పట్టించారని చెప్పారు. కానీ, కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలకు నిధుల కొరత ఉందని, దీంతో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లపై అభివృద్ధి పనుల బాధ్యత పెట్టే అవకాశం లేదని చెప్పారు. గ్రామాల్లో మన ఊరు-మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాలలకు సంబంధించిన పెద్ద బిల్లులు మాత్రమే వస్తున్నాయని, రూ.10లక్షలలోపు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, నాయకులు గోపి రాజిరెడ్డి, మల్లేశ్ యాదవ్, రవి, హరీశ్‌రావు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

