రాంనగర్, ఆగస్టు 29: నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో ఉన్న కియా కార్ల షోరూంలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. 3.50 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. వన్ టౌన్ పోలీసులు వివరాల ప్రకారం.. షోరూం మేనేజర్ శ్రవణ్ సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో బుధవారం రాత్రి 8 గంటలకు తాళాలు వేసి ఇంటికి వెళ్లారు. గురువారం ఉదయం సెక్యూరిటీ సిబ్బంది చూసేసరికి షోరూం వెనుక భాగం ఉన్న డోరు తాళం పగలగొట్టి ఉండడంతో అనుమానం వచ్చి వెంటనే మేనేజర్ శ్రవణ్‌కు సమాచారం అందించారు.
వెంటనే అకడికి చేరుకున్న శ్రవణ్ లోనికి వెళ్లి చూడగా.. షో రూమ్‌లోని క్యాబిన్లో ఉన్న లాకర్ అద్దాలు ధ్వంసం చేసి ఉండడంతో అనుమానం వచ్చి లోనికి వెళ్లి పరిశీలించాడు. అందులో ఉన్న 3.50 లక్షల లక్షలు కనిపించడం లేదని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వారు అకడికి చేరుకున్ని పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఆధారాల కోసం ప్రయత్నించారు. మేనేజర్ శ్రవణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వన్ టౌన్ సీఐ సరిలాల్ తెలిపారు.