Theft | వేములవాడ రూరల్ : వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట వైన్స్ లో శుక్రవారం రాత్రి చోరీకి పాల్పడి నగదు తో పాటు మద్యం ను ఎత్తుకెళ్లినట్లు వైన్స్ యజమాన్యం పేర్కొంది శుక్రవారం రాత్రి 10 గంటలకు వైన్స్ మూసివేసి ఇంటికెళ్లిన అనంతరం శనివారం ఉదయం వైన్స్ తెరిచేందుకు వచ్చిన సిబ్బందికి తాళాలు పగలగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో వేములవాడ రూరల్ సీఐ, ఎస్సైలు అక్కడికి చేరుకొని వైన్స్ ను పరిశీలించారు. వైన్స్ లో ఉన్న సీసీ కెమెరాలు ఫుటేజ్ ను పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు ముఖానికి మాస్క్ ధరించి లోపలికి చొరబడినట్టు సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా కనబడుతుంది. కాగా మరో ముగ్గురు బయట అనుమాస్పదంగా తిరుగుతూ కనబడినట్లు వేములవాడ రూరల్ ఎస్సై మారుతి పేర్కొన్నారు. రాత్రి రెండు గంటల ప్రాంతంలో చోరీ జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. వైన్స్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. వైన్స్ లో ఉన్న సుమారు రూ. 30000 తో పాటు కొంతమంది మద్యం ను దొంగలు ఎత్తుకెళ్లినట్లు వైన్స్ నిర్వాహకులు పేర్కొన్నారు.