Sarangapur | యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలి.. జగిత్యాల ప్రభుత్వ రక్తనిధి అధికారి డాక్టర్ ముస్కు మైత్రిరెడ్డి
రక్త నిధిలో ఎల్లప్పుడు తగిన నిల్వలు ఉండాలంటే యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తరచుగా రక్తదానం చేయాలని జగిత్యాల ప్రభుత్వ రక్తనిధి అధికారి ముస్కు మైత్రిరెడ్డి సూచించారు.
Sarangapur | సారంగాపూర్, జూన్ 30 : రక్త నిధిలో ఎల్లప్పుడు తగిన నిల్వలు ఉండాలంటే యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తరచుగా రక్తదానం చేయాలని జగిత్యాల ప్రభుత్వ రక్తనిధి అధికారి ముస్కు మైత్రిరెడ్డి సూచించారు. సారంగాపూర్ మండలంలోని పెంబట్ల గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఇండియన్ మెడికల్ అసోషియోషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 16 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మైత్రి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలు విస్తృతం అవుతున్న నేపథ్యంలో రోగులకు రక్తం రోజురోజుకు అవసరం పెరుగుతుందన్నారు. జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ వర్షా కాలంలో వైరల్ జ్వరాలు, డెంగ్యూ వంటి వ్యాదులు అధికమయ్యో అవకాశం ఉందని ప్లెట్లెట్స్తో పాటు రక్తం అవసరం కూడా పెరుగుతుందన్నారు.
తరచు రక్తదాన శిబిరాలను నిర్వహించడం అత్యంత అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ శాఖ కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ కోలపాక రాధ-రాజు, పోచంపేట సర్పంచు రెంటం జగదీష్, విండో చైర్మెన్ గురునాథం మల్లా రెడ్డి, ఉప సర్పంచ్ మైదం ప్రభాకర్, నాయకులు ముద్దం శ్రీనివాస్, బొడ్డుపెల్లి శేఖర్, శంకర్, బొక్కల రమేష్, మర్రిపెల్లి శ్రవన్, ముద్దం చిరంజీవి, జోగినీ గంగారెడ్డి, ఏఎన్ఎం నిర్మల, ఆవా వర్కర్లు, రక్త దాతలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

