Chigurumamidi | చిగురుమామిడి, జూలై 14 : సర్ ఓటర్ సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఎంపీడీవో రామ్మోహన్ చారి బీఎల్వోలను ఆదేశించారు. చిగురు మండలంలోని నవాబుపేట్ గ్రామంలో బీఎల్ఓ ల ఓటర్ సవరణ ప్రక్రియను సర్పంచ్ గూళ్ల రజిత రాజుతో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. ఏమైనా ఓటర్ల వద్ద నుండి సమస్యలు వచ్చినట్లయితే పరిష్కరించాలని వారికి సూచించారు.
నిర్ణీత గడువులోపు సవరణ ప్రక్రియ పూర్తి చేయాలని బిఎల్ఓ లను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం లో విద్యార్థుల మధ్యాహ్న భోజనం పరిశీలించారు. వీధుల్లో ఇంకుడు గుంతల నిర్మాణాలను ఎంపీడీవో సర్పంచ్ పరిశీలించారు. వీరి వెంట వీరి వెంట పంచాయతీ కార్యదర్శి సంపత్, ప్రధానోపాధ్యాయులు, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్ తదితరులున్నారు.