కమాన్‌చౌరస్తా, సెప్టెంబర్ 28 : జీవో నంబర్ 25 సవరణ చేసిన తర్వాతే ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలని యూఎస్పీసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర బాధ్యుడు వీ రాజిరెడ్డి మాట్లాడారు. జీవో నంబర్ 25లో అనేక లోపాలు ఉన్నాయని చెప్పారు.
పాఠశాలల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ రాష్ట్ర బాధ్యుడు మాడుగుల రాములు, జీ ఎల్లయ్య, చంద్రమౌళి, బాలయ్య, ములల కుమార్, పోరెడ్డి దామోదర్‌రెడ్డి, ఆవాల నరహరి, జావేద్, ఆర్ చంద్రశేఖర్‌రావు ఉన్నారు. అనంతరం, డిప్యూటీ తహసీల్దార్ ఎన్ కిషన్‌కు వినతి పత్రం అందజేశారు.