Korutla | కోరుట్ల, జూన్ 2: తెలంగాణ ఉద్యమకారులు, స్వాతంత్ర సమరయోధులు కొండ లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా ప్రభుత్వం ప్రకటించాలని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు పట్టణంలోని పద్మశాలి సంఘ భవనంలో సమావేశం నిర్వహించారు.
ఈమేరకు బాపూజీ పోరాట చరిత్ర కరపత్రాన్ని ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారన్నారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమ నాయకుడని, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమించిన కొండా లక్ష్మణ్ బాపూజీనీ తెలంగాణ జాతిపితగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గుంటుక ప్రసాద్, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ కమిటీ అధ్యక్షులు ముల్క ప్రసాద్, తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి జిల్లా ధనుంజయ్, రాష్ట్ర నాయకులు గడ్డం మధు, సంఘం నాయకులు ఎంబేరి నాగభూషణం, ఆడెపు మధు, జిందం లక్ష్మీనారాయణ, పెండెం గణేష్, పద్మశాలి సంఘ ఉపాధ్యక్షులు కటుకం వినయ్, ప్రధాన కార్యదర్శి బండ్ల రవికుమార్, కోశాధికారి అందే రాజ్ కుమార్, పద్మశాలి యువత అధ్యక్షులు జక్కుల ప్రవీణ్, బండి సురేష్, పద్మశాలి సంఘం డైరెక్టర్, ఎక్కలుదేవి రాంచంద్రం, చెన్న శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.