BJP | రుద్రంగి, ఆగస్టు 23: కేంద్ర ప్రభుత్వం పంపించిన యూరియాను కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్ లో అమ్ముకొని రాష్ట్రంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు కర్ణవత్తుల వేణుగోపాల్ విమర్శించారు. రుద్రంగి మండల కేంద్రంలో ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కర్ణవత్తుల
వేణుగోపాల్ అధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్, బీజేపీ నాయకులు గ్రామ సమస్యలు, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ పుష్పలతకు వినతిపత్రం అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పంపించిన యూరియాను కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్ లో అమ్ముకొని రాష్ట్రంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. రుద్రంగి మండల కేంద్రంలోని బస్టాండ్‌లో అంగడి బజార్లో విద్యుత్ దీపాలు వెలగడం లేదని, ఇందిరాచౌక్లోని బస్టాండ్ వద్ద పబ్లిక్ టాయిలెట్స్ లేక ప్రయాణికులు, గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు వేసిన సీసీ రోడ్లలలో నాణ్యత లోపించిందన్నారు. సూరమ్మ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పడాల గణేష్, అశోత్రెడ్డి, బోయ నర్సరెడ్డి, గండి శ్రీనివాస్, శ్రీహరి, నర్సింగరావు, గంగాధర్, శ్రీదర్, వెంకటేష్, నరేష్, సంజయ్‌లతో పాటు తదితరులు పాల్గొన్నారు.