కమాన్చౌరస్తా, జూన్ 11 : స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పోస్టుల కింద రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ జిల్లాకు 15 పోస్టులు మంజూరు చేసినట్లు కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా, స్పెషల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న ఎస్జీటీ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఉపాధ్యాయులు ఈ నెల 12న బుధవారం ఉదయం 10 గంటల నుంచి సర్టిఫికెట్లతో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలని చెప్పారు. అలాగే, ఉపాధ్యాయుల ప్రమోషన్ సీనియార్టీ జాబితా, ఖాళీల వివరాలు www.karimnagardeo.com వెబ్సెట్లో ఉంచినట్లు వివరించారు. ఇందులో అభ్యంతరాలుంటే కరీంనగర్లోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల లోపు సంప్రదించాలని చెప్పారు.