BRS | తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్12: రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉల్లెంగల ఏకానందం కోరారు. మండలంలోని పర్లపల్లి లో ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏప్రిల్ 27 న వరంగల్ లో నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ రజాతోత్సవ సభకు కార్యకర్తలు అందరూ భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం గ్రామంలో ఇటీవల మరణించిన కుటుంబాలను పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు తాటిపెల్లి చంద్రమౌళి, మాజీ సర్పంచ్ మాదడి భారతి, మాజీ ఎంపీటీసీ ముప్పిడి సంపత్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ సుద్దాల రాజేష్, గ్రామ యూత్ అధ్యక్షులు బాగోతం తిరుపతి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.