Veenavanka | వీణవంక, జూన్ 6: బేతిగల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గొట్టిముక్కల రంగారావు సేవలు మరువలేనివని గ్రామస్తులు కొనియాడారు. మండలంలోని బేతిగల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గొట్టిముక్కల రంగారావు ఇటీవల మృతి చెందాడు. కాగా వారి కుటుంబ సభ్యులు శుక్రవారం ఆయన విగ్రహ ప్రతిష్టాపన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ కోసం, రామాలయ గుడి నిర్మాణానికి స్థల సమస్య ఉండగా ముందుకు వచ్చి వారి స్థలం ఎకరం భూమి ని విరాళంగా ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టిముక్కల రాజేశ్వర్ రావు, చొప్పరి సారయ్య, గుజ్జుల రామ్ రెడ్డి, పడిదెల పాపారావు, బలగొని తిరుపతి, కంబాల సంపత్, గొట్టే పుల్లయ్య, ఐలయ్య, శ్రీనివాస్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.