Sridhar Babu | మంథని, ఏప్రిల్ 20 : ఏసుక్రీస్తు త్యాగం గొప్పదని శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు పేర్కొన్నారు. క్రైస్తవుల పర్వదినం ఈస్టర్ పండుగ సందర్భంగా ఆదివారం మంథని మున్సిపల్ పరిధి శ్రీపాద కాలని సీయోను చర్చిలో ఈస్టర్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరణాన్ని గెలిచిన యేసుక్రీస్తును ఆరాధించడం ఎంతో భాగ్యమని. ప్రేమ, సహనం, శాంతికి నిర్వచనం అన్నారు. యేసు క్రీస్తు బోధనలు ప్రపంచ శాంతికి దిక్సూచి అని, మానవవాళికి ప్రేమ, శాంతిమార్గం చూపిన మహనీయుడు యేసుక్రీస్తు అని కొనియాడారు.
మానవులందరి పాప క్షమాపణ కోసం ఏసుక్రీస్తు సిలువ మరణం పొందాడని కీర్తించారు. క్రీస్తు యేసు అనుగ్రహం అందరిపైనా ఉండాలని అన్నారు. స్థానిక పాస్టర్ దూడ మహేష్ మాట్లాడుతూ క్రీస్తు బోధనలు అందరూ అవగతం చేసుకొని, సన్మార్గంలో ముందుకెళ్లాలని ఆయన తెలిపారు. ఈ సందర్బంగా క్రైస్తవులకు శ్రీను బాబు స్వీట్లు తినిపించి ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. పాస్టర్ మహేష్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈస్టర్ ప్రత్యేక గీతాలను సీయోను క్వాయర్ బృందం ఆలపించారు.
అనంతరం ఈస్టర్ ప్రేమ విందు సహా పంక్తి భోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ మిషన్స్ ఇండియా ప్రధాన కార్యదర్శి అంకరి కుమార్, సంఘ పెద్దలు ఎం కే జోసెఫ్, మంథని ప్రసాద్, అందే రమేష్, చింతకుంట్ల ప్రేమ్ కుమార్, దాసరి సదానందం, రామగిరి కుమార్, ఈర్ల సదా నందంతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమాదేవి వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య మండల పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెంటరి రాజు, కలవేన శ్రీకాంత్, కొయ్యల దేవేందర్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.