Chigurumamidi | చిగురుమామిడి, నవంబర్ 29 : స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని తిమ్మాపూర్ సీఐ సదన్ కుమార్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని చిన్నముల్కనూర్, పీచుపల్లి గ్రామాల్లో ఓటర్లకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలను వివరించారు. ఎన్నికలను శాంతియుత వాతావరణాల్లో జరుపుకునేలా సహకరించాలని గ్రామస్తులకు సూచించారు. ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఎన్నికల నియమాలకి విరుద్ధంగా ఎవరైనా వివరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. వీరి వెంట ఎస్సై సాయికృష్ణ తదితరులు ఉన్నారు.