గోదావరిఖని, జూన్ 19: రామగుండం-మణుగూరు రైల్వే లైన్లో మార్పు చేయాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ కోరారు. ప్రజా అవసరాల దృష్ట్యా రామగుండం సమీపంలోని రాఘవాపూర్, మంథని, మేడారం సమక్క సాలరమ్మ జాతర సమీప తాడువాయి నుంచి భద్రాచలం, మణుగూరు వరకు నడిపించేలా ప్రణాళిక చేయాలని సూచించారు. శుక్రవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రవాణా మెరుగు కోసం గోదావరిఖనిని కలుపూతూ కొత్త మార్గం కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు.
దాదాపు రూ.5,818.45 కోట్లతో 208 కిలోమీటర్ల పొడవున నిర్మించే లైన్‌కు రూట్ మ్యాప్‌లో కొంత మార్పులు జరిగితే ఈ నగర ప్రాంత ప్రజలకు సౌకర్యం కలగడంతోపాటు రవాణా మరింత మెరుగుపడుతుందన్నారు. కోల్ కారిడార్ మరింత అభివృద్ధి కానుందన్నారు. ఈ విషయపై పెద్దపల్లి ఎంపీ అన్ని వర్గాలతో పరిశీలన చేయాలని సూచించారు. ఇక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేకల సమ్మయ్య, తోకల రమేశ్, నాయకులు మురళీధర్‌రావు, మూల విజయారెడ్డి, గుంపుల లక్ష్మి, కృష్ణవేణి, పద్మ, తాళ్ల రాజయ్య, మెతుకు దేవరాజు, కరక శ్రీనివాస్, దొమ్మెటి వాసు, కిరణ్, కనకరాజు, తదితరులు ఉన్నారు.