పుణ్యస్నానం చేసి.. పులకించి
కరోనా నేపథ్యంలో 2020 ఫిబ్రవరి 19న మూతబడడ రాజన్న ఆలయ పుష్కరిణి దాదాపు 34 నెలల తర్వాత ప్రారంభమైంది. ఆలయ పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి పులకించిపోయారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ధర్మగుండంలో ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు పుణ్యాహవాచనం, గణపతి పూజ ఘనంగా నిర్వహించారు.
- 34 నెలల తర్వాత ప్రారంభమైన రాజన్న ధర్మగుండం
వేములవాడ టౌన్, డిసెంబర్ 4 : కరోనా నేపథ్యంలో 2020 ఫిబ్రవరి 19న మూతబడడ రాజన్న ఆలయ పుష్కరిణి దాదాపు 34 నెలల తర్వాత ప్రారంభమైంది. ఆలయ పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి పులకించిపోయారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ధర్మగుండంలో ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు పుణ్యాహవాచనం, గణపతి పూజ ఘనంగా నిర్వహించారు. అనంతరం, ధర్మగుండంలో సంప్రోక్షణ పూజలు నిర్వహించి, అర్చకులు, ఆలయ సిబ్బంది కూడా ధర్మగుండంలో స్నానాలు చేశారు. అనంతరం ధర్మగుండంలోని పవిత్ర జలంతో శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా భక్తులు ధర్మగుండంలో స్నానాలు ఆచరించి తమ జన్మధన్యమైందని పేర్కొన్నారు.
ఇంతకాలం ఏదో లోటనిపించింది
ఏటా రాజన్న దర్శనం కోసం వస్తాం. ప్రతిసారి ధర్మగుండంలో స్నానం చేసిన తర్వాత కోడెమొక్కు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో రెండేళ్లుగా ధర్మగుండంలో స్నానమాచరించక పోవడం మాకు ఏదో లోటుగా అనిపించేది. ఈ రోజు ఏకాదశి సందర్భంగా ధర్మగుండంలో సంప్రోక్షణ పూజలు కాగానే మేం సరిగంగ స్నానాలు చేశాం. మా ఆనందానికి అవధుల్లేవు.
-మహేందర్, శ్వేత దంపతులు, జమ్మికుంట
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

