గద్వాల, జూలై 30 : మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో జూరాల ప్రాజెక్టు జళ కళ సంతరించుకోగా జూరాల ప్రాజెక్టు నుంచి నెట్టెంపాడ్ లిఫ్ట్ ప్రా రంభం కాగా దాని నుంచి గుడ్డెందొడ్డి, ర్యాలంపాడ్ రిజర్వాయర్‌లోకి నీరు చేరుతుండండ తో రైతులు, ప్రజల్లో ఆనందం వెల్లువిరుస్తున్నది. నెట్టెంపాడ్తో పాటు కోయిల్‌సాగర్, భీమాలిఫ్ట్-1,2 ద్వారా నీటిని ఎత్తపోయడంతో రైతులకు వానకాలం సాగుపై ఆశలు రేకెత్తుతున్నాయి. అధికారులు ఓ వైపు ఎల్‌నినో కా రణంగా ఆరుతడి పం టలు సాగు చేసుకోవాలని సూచిస్తుండగా, కళ్ల ముందు ప్రా జెక్టుల్లో జళకళ సంతరించుకోవడంతో రైతులు సాగుపై దృష్టి పెట్టారు.
ప్రాజెక్టుల్లో క్రమంగా నీటి నిల్వలు పె రుగుతుండడంతో ఈ వానకాలం సాగుకు ఎటువంటి ఢోకా ఉండదనే ఆలోచనలో రైతులు ఉన్నారు. అయి తే రైతుల ఆశలపై ఎల్‌నివో ప్రభావం చూపుతూ అధికారులు, ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లే ప్రయ త్నం చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు గురువారం ఎగువ నుంచి 94,733 ఇన్‌ఫ్లో వస్తుండగా అధికారులు ఉదయం 10గేట్లు ఎత్తారు. వరద ప్రవాహం పెరగడంతో 12గేట్లు.. రాత్రికి 17 గేట్ల ద్వారా 67,235 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా వి ద్యుదుత్పత్తి కోసం 37,906 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ నెట్టెంపాడ్ లిఫ్ట్‌కు 750 క్యూసెక్కులు, భీ మాలిఫ్ట్-1కు 1300, భీమా లిఫ్ట్-2కు 750, కోయిల్‌సాగర్ లిఫ్ట్‌కు 315 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
అలాగే ప్రాజెక్టు డమ కాల్వకు
870, కుడి కాల్వకు 500, సమాంతర కాల్వకు 600 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాలకు ఇన్‌ఫ్లో 1,04,375 క్యూసెక్కులు కా గా అవుట్‌ఫ్లో 1,09,519 క్యూసెక్కులుగా నమోదైంది. ఫుల్ లెవల్ 318.516 మీట ర్లు ఉండగా 317.51 మీటర్ల నిల్వలు ఉండగా.. సామర్థ్యం 9.657 టీఎంసీలకుగానూ 7.663 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. వరద నీరు పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందిని డ్యాం అధికారులు తెలిపారు.